బషీర్బాగ్, వెలుగు: పెట్రోల్ కొరతను నిరసిస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. బుధవారం హిమాయత్ నగర్ ఏఐటీయూసీ భవన్ నుంచి వై జంక్షన్ కూడలి వరకు బైక్లను నెట్టుకుంటూ వెళ్లారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ.. చమురు సరఫరా లోపాలు, ధరల నియంత్రణలో వైఫల్యం, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేయడం, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు మళ్లించడం వంటి చర్యలను అరికట్టాలని కోరారు.
